Friday, May 7, 2010

మాతృదేవోభవ

నిజమే ....కనిపించే దేవత అమ్మ ....

మన తొలిగురువు అమ్మ ..

మొదటిసారిగా లోకాన్ని చూపించేది అమ్మ ...

అమ్మ అంటే ఒక అపురూపమైన , అద్భుతమైన కావ్యం .

అమ్మ అనే కావ్యాన్ని అందరూ రాయలేకపోయినా ...అందరూ కావ్యాన్ని అనుభూతి చెందే వాళ్ళే ...

మురిపాలు , జోలపాటలు ,గోరుముద్దలు ,నీతి కథలు అనురాగాలు , ఆత్మీయతలు , ఎన్నో , ఎన్నెన్నో అంతే లేని భావాలూ ...వర్ణనాతీతం ...

అమ్మతో అనుబంధమే లేని జీవితం అసలు ఉండదేమో ...

ఊహ తెలిసినప్పటి నుండి ...ఎన్నో జ్ఞ్యాపకాలు, ఎన్నెన్నో మధుర స్మృతులు ఎంత చెప్పినా తక్కువే ...

కోటి గొంతుకలతో ...'అమ్మా నిన్ను ప్రేమిస్తున్నాను' అని చెప్పినా తక్కువే ...

అమ్మా లేనివాడు అనాధ అని ఎవరో అన్నారు ...అది అక్షరాలా నిజం ...

అమ్మ అనుబందం వ్యక్తిగతమే ....కానీ "అమ్మతనం" అనే అమృత వాహిని ...జీవ నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది ..

అమ్మ ప్రేమ నిష్కల్మషం , అమ్మ మనకి ఊపిరి పోయటానికి తన ఊపిరి తీసుకోవటానికే సిద్ధమవుతుంది ..

అమ్మ ఎప్పుడూ ఏదీ ఆశించదు ...పిల్లలు ఆశ పడేవి అందించాలని తప్ప ...

తను పస్తు ఉండైనా తన పిల్లలకి పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టాలని ఆరాటపడుతుంది . .

లేక్కలేన్నాన్ని సుఖాలు అందివ్వాలని అనుకుంటుందే తప్ప దేన్నీ "లెక్క" చేయదు ...

తన పిల్లల సుఖాల్లో తన సుఖం చూసుకుంటుంది ...పిల్లలు కష్టపడితే తను విలవిల లాడుతుంది ...

ఇంతటి సుగుణం మనకు ఎక్కడా కనబడదు...

అమ్మ ఎంత మంది పిల్లలకి అయినా తన ప్రేమని సమానంగా పంచుతుంది .....కానీ ...అంత మంది పిల్లలు ...ఒక్క అమ్మని పోషించటానికి వాటాలు వేసుకుంటారు ...

ఇది ఎంత వరకు సమంజసం???.....పిల్లలూ ...మీరు ఆలోచించండి .. అమ్మే లేకుంటే ...నీకు జన్మ ఎక్కడిది?? సుఖాలు ఎక్కడివి???

చివరగా నేను ఒకటి చెప్పదలచుకున్నాను ....

"Mother's Day" అనేది మన సాంప్రదాయం కాదు .... పాశ్చాత్య సాంప్రదాయం ...

మనకు ప్రతిరోజు "Mother's Day" మన భారతీయ సాంప్రదాయంలో రోజు అమ్మని పూజిస్తాం ...."Western Culture" ని అనుసరించి దయ చేసి మీ మాతృ మూర్తులని ...."Old Age Home" పాలు చేయవద్దు…. 'మాతృత్వాన్ని" కించపరచవద్దు ...మాతృ సంక్షోభాన్ని సృష్టించొద్దు …..

"మాతృదేవోభవ" .... నా చిన్ని వ్యాసం నా "మాతృమూర్తి " కి అంకితం ....

---మంత్రి కరుణ శ్రీకాంత్